Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్య సేవలు అమలుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్..

వైద్య సేవలు అమలుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలోని వైద్య సేవల అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సిబ్బంది సమస్యలు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్ , వైద్య ఆరోగ్య శాఖ పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చెందిన అధికారులు మరియు వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు,  ఏరియా హాస్పిటల్స్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు తప్పనిసరిగా నేషనల్ క్వాలిటీ అస్సూరెన్సు  స్టాండర్డ్స్  స్టాండర్డ్స్  సర్టిఫికేషన్ పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 31 లోపల అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఇంటర్నల్ అసెస్‌మెంట్ పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే సర్టిఫికేషన్ పొందిన 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రీ-సర్టిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని తెలిపారు. చౌటుప్పల్‌లో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా హాస్పిటల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని టి ఎస్ ఎం ఐ డి సి  అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ మెడికల్ స్టోర్ భవన నిర్మాణ పనుల పురోగతిని పై సమీక్షించారు.

మాతృశిశు ఆరోగ్య సేవల పరంగా ఏఎన్సి  రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్న వర్కట్‌పల్లి,  మోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వాటిని మెరుగుపరచాలని సూచించారు. మూడవ చెక్-అప్ తక్కువగా ఉన్న పి.ఎస్. బొమ్మలరామారం ప్రాంతంలో సేవలను మెరుగుపరచాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా అర్బన్ భువనగిరి ప్రాంతంలో ప్రస్తుతం 25 శాతం మాత్రమే ఉన్నందున దానిని పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్సి లు, ఏరియా హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో గత రెండు సంవత్సరాలకు సంబంధించిన డెలివరీల డేటాను సమగ్రంగా సిద్ధం చేయాలన్నారు.

డయాగ్నోస్టిక్ సేవల విషయంలో జిల్లాలోని టీ -హబ్   ద్వారా థైరాయిడ్ ప్రొఫైల్ సహా మిగిలిన అన్ని పరీక్షలు సజావుగా నిర్వహించబడేలా చూడాలని, టి3,టి4, టి ఎస్ హెచ్  సంబంధిత రక్త పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన సిబిఎన్ ఎ ఎ టి  పరీక్షలు ప్రస్తుతం తక్కువగా జరుగుతున్నందున వాటిని పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.  డయాగ్నోస్టిక్ యంత్రాల మరమ్మతులు వెంటనే చేపట్టి సేవలలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

పరిపాలనా అంశాల పరంగా జిల్లాలోని ఆరోగ్య సంస్థలలో స్టాట్యూటరీ కమిటీ మీటింగులు పెండింగ్‌లో ఉన్నవాటిని వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. ఇకపై జరిగే ప్రతి సమావేశానికి మీటింగ్ మినిట్స్ నమోదు చేసి ఫాలోఅప్ నివేదికలను సమర్పించాల్సిందిగా సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం పెండింగ్‌లో ఉన్న రిక్రూట్మెంట్లకు నోటిఫికేషన్లు ఇవ్వాలని, ప్రభుత్వం అనుమతి అవసరమైన పోస్టుల విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.అలాగే జిల్లాలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టిఫ్ఫా  స్కాన్ సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, భువనగిరిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సన్నాహాలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సిబ్బంది సంక్షేమం విషయంలో ఆశా కార్యకర్తలు, ఎం ఎల్ హెచ్ పి లు, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మనోహర్ ,  జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డా. పాండు నాయక్ , ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, డా స్వప్న రాథోడ్ , సూపరింటెండెంట్, సిహెచ్సి  ఆలేర్, డా. శ్వేతా ప్రియాంక, సిహెచ్సి  రామన్నపేట్, ప్రోగ్రాం అధికారులు డా యశోద , డా రామకృష్ణ , డా వీణ , డా  వంశీ కృష్ణ , డా సుమన్ కళ్యాణ్ , డా విజయ  పీహెచ్ఎస్సి  మోటకొండూర్, ఈ ఈ  – టి ఎస్ ఎం ఐ డి సి , 108 జిల్లా కోఆర్డినేటర్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -