Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంజర రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

కంజర రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్
మండలం కంజర గ్రామంలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్/ కళాశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను తిరుగుతూ, నిశితంగా పరిశీలించారు. కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ లలో వసతులను పరిశీలన జరిపారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. స్టోర్ రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పు దినుసులు, వంట నూనె ఇత్యాది సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాల తరగతి గదులు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -