Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించి శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. ఆర్యనగర్, ప్రగతినగర్, ఖిల్లా రోడ్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విధులకు హాజరైన శానిటేషన్ సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులను నిశితంగా పరిశీలన జరిపి, అధికారులకు సూచనలు చేశారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని నివాస ప్రాంతాలలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు శానిటేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చూడాలన్నారు. డ్రైనేజీలలో చెత్తా చెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయించాలని అన్నారు ప్రజల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న శానిటేషన్ విభాగం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ పక్కాగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ శానిటేషన్ విభాగం అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -