– సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి
నవతెలంగాణ – రాయపోల్ : రాయపోల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం ఆకస్మికంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించి సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి మహారాజ్ ఫీల్డ్ విజిట్‌లో ఉన్నట్లు సిబ్బంది తెలియజేయగా, వెంటనే వీడియో కాల్ ద్వారా నిజనిర్ధారణ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఆసుపత్రి సమయాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. తహసీల్దార్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ వివరాలపై ఆరా తీశారు.ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ బిఎల్ఓల పనితీరును సమీక్షించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు సంబంధించి మండలంలోని గ్రామాలలో భూయజమానులతో చర్చలు జరిపి ఆర్బిట్రేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కృష్ణమోహన్, డిప్యూటీ తహసిల్దార్ రాజేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…విధుల్లో నిర్లక్ష్యంపై హెచ్చరిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



