Saturday, February 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఓటు హక్కుపై అవగాహన కల్పించిన కలెక్టర్

ఓటు హక్కుపై అవగాహన కల్పించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే వార్డుల కోసం పాటుపడే నాయకులని ఎన్నుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శనివారం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ  పరిధిలో డి.ఆర్.డి.ఓ నాగిరెడ్డి, భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ రామలింగం , ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో ఆర్డిఓ కృష్ణారెడ్డి, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో అడిషనల్ డి ఆర్ డి ఓ సురేష్, పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తహసిల్దార్ శ్రీనివాస్, కమిషనర్ అంజన్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్డీవో శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీప్  కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా ఓటర్లతో తమ ఓటును డబ్బుకు, మద్యానికి, ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా నిజయమైన, ఒక మంచి వార్డు మెంబర్ ను ఎంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కుప్రజాస్వామ్య పునాది అని,ఓటరు గా నమోదు అయిన ప్రతీ ఒక్కరు ఓటు వేయాలన్నారు. ఓటు హక్కు వినియోగం, అవగాహన ర్యాలీలు చేయడం  వలన  మార్పువస్తుందన్నారు. ఇప్పుడు విద్యార్థుల కావొచ్చు కానీ రాబోయే రోజుల్లో విద్యార్థులందరూ ఓటర్ లు అవుతారన్నారు. ఓటర్లు డబ్బులకు , మద్యానికి ,గిఫ్ట్ లకి,బిర్యానీకి లేక వేరే ఇతర కానుకలలు  ఇచ్చేవారికి  ఓటు వేస్తే ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థిని వార్డు అభివృద్ధి పై  అడిగే హక్కుని కోల్పోతాం అన్నారు.

మీ ఇంట్లో లేదా మీరు కలిసి పని చేసే చోట మంచి నాయకులను ఎంచుకోవడం వలన మన వార్డు లు అభివృద్ధి చెందుతుందని  చర్చించుకోవాలన్నారు. అభ్యర్థులు ఇచ్చే ప్రలోభాలకు లోబడకుండా ఒక మంచి వ్యక్తిని అందరూ మెచ్చే విధంగా ఎంచుకోవాలన్నారు. ఎవరికి ఓటు వేస్తే మనకి ఉపయోగం ఉంటుందని, అవసరానికి ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరు అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేసేలా అందరూ కలసి చర్చించుకోవాలన్నారు.

ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం వలన వార్డు ల అభివృద్ధిలో ముందు వుంటాయని తెలిపారు. మీరు మీ వార్డులలో కూడా మా ఓటు ని అమ్ముకోము స్వచ్ఛందంగా ఓటు ని వినియోగించుకుంటాం అని బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -