నవతెలంగాణ – కామారెడ్డి
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడాకారులను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. కామారెడ్డి జిల్లాకు మీరు తెచ్చిన గౌరవం ప్రశంసనీయమైనది. ఇదే ఉత్సాహం, కృషి, పట్టుదలతో ముందుకు సాగి, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విజేతలుగా నిలవాలి అని ఆకాంక్షించారు. క్రీడా రంగంలో జిల్లాకు మరిన్ని విజయాలు సాధించేలా తగిన సదుపాయాలు కల్పించడానికి జిల్లా యువజన, క్రీడాశాఖ తరఫున ఎంత గానో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి రంగ వేంకటేశ్వర గౌడ్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, సెక్రటరి అనిల్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ విజేతలను సన్మానించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



