నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : పీఎం కేంద్రీయ విద్యాలయ భువనగిరి – 2వ తరగతి ప్రవేశాల కోసం లాటరీ పద్ధతిలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డ్రా తీశారు. మంగళవారం రోజు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో విద్యాలయ ప్రిన్సిపాల్ చంద్రమౌళి కార్యక్రమం అధ్యక్షతన పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో 2వ తరగతిలో ఖాళీగా ఉన్న నాలుగు (4)సీట్లను భర్తీ చేయుటకు లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్, విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు స్వయంగా లాటరీ తీసి విద్యార్థుల ఎంపిక చేశారు.
లాటరీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, కేంద్ర విద్యాలయాల మార్గదర్శకాల మేరకు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే మా లక్ష్యం అన్నారు. లాటరీ ద్వారా అర్హులైన అభ్యర్థులను నిష్పక్షపాతంగా ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవేశాల ఇంచార్జి కుమారి ,మనీషా శంక్లా, కమిటీ సభ్యులు శ్రీపాద, ఆనంద్ కుమార్, అంకిత్ లు పాల్గొన్నారు.
కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలకు లాటరీ డ్రా తీసిన కలెక్టర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES