నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ హనుమంత రావు మంగళవారం కలెక్టరేట్ మీని మీటింగ్ హాల్ లో కేక్ కట్ చేసి, ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక కళ మాత్రమే కాకుండా భావోద్వేగాలను, అనుభూతులను, జీవితంలోని అద్భుత క్షణాలను సజీవంగా నిలిపే సాధనమని టెలిపారు. ప్రతి ఫోటో వెనుక ఒక కష్టపడే ఫోటోగ్రాఫర్ శ్రమ, ప్రతిభ దాగి ఉంటుందని, సమాజాన్ని స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర అపారమైనదని అన్నారు.
అనంతరంఫోటో గ్రాఫర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ భాస్కరరావు,డిపిఆర్ ఓ అరుంధతి తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ – యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా అధ్యక్షుడు గంధమల్ల రాజు, ,ఉపాధ్యక్షులు కృపానగరo ఫణిందర్, గుజ్జ నరేష్, ప్రచార కార్యదర్శి కర్రె గణేష్, దేశ్ పాండే నరసింహ, కృపానగరo అభిషేక్ సభ్యులు పాల్గొన్నారు.