Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్

క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
సీఎం కప్ క్రీడలలో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సన్మానించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనపరచిన సబ్ జూనియర్ బాలికల విభాగంలో (sub juniors Girls) 40 kg -జ్యోతి కాంస్య పతకం, సబ్ జూనియర్ బాలుర విభాగంలో ( Sub junior Boys) 48kg – అనిల్ కాంస్య పతకం, 60 kg – ప్రవీణ్ కాంస్య పతకం (Junior Boys) 65kg – ప్రభాష్ రజత పతకం (70Kg-Bhaskar ) రజత పతకం  సాధించడం జరిగింది.

ఈ సందర్భంగా క్రీడాకారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, ఐ.ఎ.ఎస్. ,కామారెడ్డి జిల్లా రెజిలింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జుక్కల్ మండల నివాసి అయిన వినోద్ కుమార్ , టీం కోచ్ హిమబిందు, ప్రవీణ్, అసోసియేషన్ సెక్రటరీ పవన్ కుమార్ , జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల  పి ఈ టి దానయ్య ,DYSO రంగ వెంకటేశ్వర రావు గారు క్రీడాకారులను అభినందించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -