నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని ఎరగండ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ పత్తి కొనుగోలు కేంద్రం ను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం కు రైతులు తీసుకువచ్చిన పత్తిని,కొనుగోలు కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలను ఆమె పరిశీలించి,రైతులతో మాట్లాడారు. దళారుల వద్ద పత్తిని అమ్ముకొని నష్టపోవద్దని, నాణ్యమైన పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకొని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరను పొందాలని తెలిపారు. రైతులు కన్ఫ్యూజ్ కాకుండా కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు. రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేపట్టాలని, ప్రతిరోజు కొనుగోలు వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని, రైతులకు ఇబ్బంది కలిగించిన కొనుగోలులో అక్రమాలకు పాల్పడిన చర్యలు తప్పవని యాజమాన్యానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీదేవి, తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.
పత్తి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



