Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్వేములవాడలో కూల్చివేత పనులను పరిశీలించిన కలెక్టర్

వేములవాడలో కూల్చివేత పనులను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ : వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో నిర్మాణాల కూల్చివేత పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. తిప్పాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న పలు నిర్మాణాలను అధికారులు సోమవారం ఉదయం కూల్చి వేయిస్తుండగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు నిర్మాణంతో భక్తులు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -