- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ / యాదగిరిగుట్ట
యాదగిరిగుట్టలో దేవస్థానం కోసం కొండపైకి వెళ్లేందుకు ఎంట్రీ ప్లై ఓవర్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్ అండ్ బి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జరుగుతున్న పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పనులు ఏ ఏ దశలో ఉన్నాయో వివరాలను అడిగి తెలుసుకుంటూ.. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు సురక్షితంగా ప్రయాణించేలా ఘాట్ రోడ్డు పనులను సమయానికి పూర్తి కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారి సరిత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



