నవతెలంగాణ – కోహెడ
మండలంలోని తంగళ్లపల్లి, గుండారెడ్డిపల్లి గ్రామాలలోని లోలెవల్ బ్రిడ్జ్ లను ఆదివారం జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. తంగళ్ళపల్లి గ్రామంలో పిల్లి కాలువ, మోయతుమ్మెద వాగు నీటి ప్రవాహాన్ని ఆమె పరిశీలించారు. అలాగే గుండారెడ్డిపల్లి గ్రామంలో నక్క వాగును పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిలను అధికారులు పరిశీలించాలని సూచించారు. అధిక వర్షాలతో ప్రజలకు ఇబ్బందులకు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కంటిన్యూగా వర్షాలు పడితే లో లెవెల్ బ్రిడ్జిల పై నుండి వర్షం నీరు ప్రవహించే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైనప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి బ్రిడ్జిలపై రాకపోకలను ఆపివేయాలని ఆర్ అండ్ బి డిఇ వెంకటేష్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, తదితరులు ఉన్నారు.
లో లెవల్ బ్రిడ్జిలను పరిశీలించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES