నవతెలంగాణ – కామారెడ్డి
బుధవారం నర్సంపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేయాలనీ, వెంట వెంటనే లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రైతుల నుండి కొనుగోలు చేసిన అనంతరం ఎప్పటికప్పుడు లారీలలో లోడ్ చేయించి మిల్లులకు తరలించాలని, ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు.
తేమశాతం చెక్ చేయాలనీ, ప్రతిరోజూ సంబంధిత అధికారులు, మండల అధికారులు కేంద్రాలను పర్యవేక్షించాలని ఆన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు టాబ్ ఎంట్రీ లు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందిస్తూ ఏ – గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు 2389 రూపాయలు, సాధారణ రకానికి 2369 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడం తో పాటు సన్న రకానికి అదనంగా 500 రూపాయల చొప్పున బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



