Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట గ్రామం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని,ఆస్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఓపీ,రిజిస్ట్రేషన్ కౌంటర్,ల్యాబ్,ఇన్ పేషంట్ వార్డు,వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు.

మెడికల్ ఆఫీసర్ తో పాటు,విధుల్లో ఉన్న సిబ్బంది హాజరును పరిశీలించారు.ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.ఆసుపత్రి లోని అన్ని రూమ్ లని పరిశీలించారు.ఆసుపత్రి కి వచ్చిన రోగులతో మాట్లాడి జబ్బు నయమయ్యేందుకు  మందులు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.అన్ని రకాల మందులు,వాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి తెలిపారు.ఆలేరు  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్పుటం టెస్ట్ తీసుకోవడానికి టెక్నీషియన్స్ లేక ఇబ్బంది భువనగిరి ఆసుపత్రికి కి పంపవలసి ఉంటుందని వైద్యులు కలెక్టర్ తెలియజేయడంతో వెంటనే డి.ఎం.ఎచ్ ఓ తో మాట్లాడి వెంటనే టెక్నీషియన్ తీసుకోవాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -