Wednesday, January 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఆలేరు మున్సిపల్  నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

 ఆలేరు మున్సిపల్  నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ : జిల్లా 2 వ మున్సిపల్ సాధారణ ఎన్నికలు పురస్కరించుకుని, ఆలేరు మున్సిపాలిటీ లో మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ, ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి   బుధవారం  హెల్ప్ డెస్క్ ని పరిశీలించారు. ఎంత మంది నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారు. ఎన్ని నామినేషన్ పత్రాలు తీసుకెళ్తున్నారు,ఏ వార్డు కి తీసుకెళ్తున్నారు వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలి అన్నారు.

రిటర్నింగ్ అధికారులు నామినేషన్ పత్రాలు తీసుకునేటప్పుడు అన్ని పత్రాలు పరిశీలించి తీసుకోవాలి అని అన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ లు స్వీకరించాలి అని  పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో  తహసిల్దార్ ఎన్నికల అధికారి వి ఆంజనేయులు, మున్సిపల్   కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జగన్మోహన్, పురపాలక సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -