Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కూడవెల్లి వాగును పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి

కూడవెల్లి వాగును పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో చూడ్డానికి, దాటడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధి కారులను ఆదేశించారు. మంగళవారం మండలం లోని లింగంపేట గ్రామ పరిదిలో గల లో లెవల్ వంతెన పైనుండి కూడవెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాగు ఉదృతంగా ప్రవహిస్తున్ననం దున రాకపోకలు నిలిపివేశామని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వాగు లో- లెవల్ వంతెన కింద నుండి నీరు వెళ్ళే వరకు రాకపోకలు నిలిపి వెయ్యాలని అన్నారు. అలాగే అర్ అండ్ బి అధికారులు వంతెన నాణ్యత చెక్ చేశాకే  రాకపోకలు సాగించాలని సూచించారు. అలాగే ఎవ్వరు సాహసోపేతంగా వాగు చూడడానికి, దాటడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధిారులను ఆదేశించారు. పక్కన ఎలక్ట్రిసిటీ లైన్ పైన విద్యుత్ తీగలకి సరిచెయ్యాలని ఎలాంటి అపాయం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad