- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, విద్య సంస్థల సమన్వయంతో ఉద్యోగార్థులకు, ఉద్యోగదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి చే ప్రారంభింప బడిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ (డిడిఈటి). డిడిఈటి అనే అప్లికేషన్కు సంబందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ చేత ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిడిఈటి అనే అప్లికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లోని జిల్లా పరిశ్రమల కేంద్రం, రూమ్ నెంబర్ 122నందు సంప్రదించలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -