Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

- Advertisement -

నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ హైమావతి సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మలేరియా, డెంగ్యూ కేసులపై ఆరా తీశారు. అటెండెన్స్‌ వోపీ, పలు రిజిష్టర్‌లను పరిశీలించారు. మెడిసిన్‌ సరఫరా త్వరగా జరిగేలా చూడాలని డీఎంహెచ్‌వోని ఫోన్‌లో ఆదేశించారు. ఒక నెల ముందే కావల్సిన మెడిసిన్‌ ఇండెంట్‌ చేయాలని మెడికల్‌ ఆఫీసర్‌కు తెలిపారు. రోగులతో మాట్లాడుతూ జ్వరం, జలుబు, దగ్గు లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

చుట్టు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని శనిగరం గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తేమశాతం రాగానే గన్ని బ్యాగులు అందజేయాలని లోడ్‌ చేసిన వెంటనే లారీలలో ఎక్కించేలా చూడాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఐకెపీ ఏపీఎం శ్రీనివాస్‌, సీసీ సంపత్‌, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -