Monday, May 5, 2025
Homeకరీంనగర్శ్రీ భగీరథ మహర్షికి కలెక్టర్ ఘన నివాళి..

శ్రీ భగీరథ మహర్షికి కలెక్టర్ ఘన నివాళి..

- Advertisement -

జిల్లా సమీకృత కార్యాలయంలో వేడుకలు
నవతెలంగాణ – సిరిసిల్ల

శ్రీ భగీరథ మహర్షికి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆదివారం శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ముందుగా శ్రీ భగీరథ మహర్షికి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జునరావు, కుల సంఘం ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -