- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం అందించే ఉత్తమ ఉద్యోగుల అవార్డులకు మండలం నుండి పాలు శాఖల సిబ్బంది ఎంపికయ్యారు. వీరికి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రశంసా పత్రాలతో అభినందించారు. వీబీ జీ రాం జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్) ఏపీఏం కే. రామచంద్రరావు, మున్సిపాల్టీ నుండి వార్డ్ ఆఫీసర్ గా ఎన్.రమణ, ఎలక్ట్రీషియన్ రాజపుత్ర రంజిత్ సింగ్(నందు) ఎన్పీడీసీఎల్ పాల్వంచ డివిజన్, అశ్వారావుపేట సబ్ డివిజన్ అశ్వారావుపేట ఏఎల్ఎం వలీ పాషా ఎన్పీడీసీఎల్ సీఎం డీ వరుణ్ రెడ్డి చేతులు మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.
- Advertisement -



