నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : పోచంపల్లి మండలం జూలూరు గ్రామం పరిధిలోని అలీనగర్ పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న సీఈఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తేమ శాతం వచ్చిన తరువాత కూడా ధాన్యాన్ని కాంట వేసి లోడింగ్ చేసి రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని సూచించారు. సీఈఓ ఇటీవల అలీనగర్ సెంటర్ ని ఇప్పటి వరకు వచ్చి చూడలేదని, హమాలీలను కూడా ఏర్పాటు చేయనందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది రానివ్వమని సూచించారు. డీసీవోను జిల్లాలోని అన్ని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలలో సరిపడా హమాలీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి సెంటర్ లో రైతులకు త్రాగునీరు, ఉండడానికి టెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు.
పీఏసీఎస్ సీఈఓను సస్పెండ్ చేసిన కలెక్టర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES