నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ సంబంధించిన పోస్టరును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, జిల్లా సమన్వయ అధికారి పోతంశెట్టి సుధాకర్ లు హాజరయ్యారు. 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లలో అడ్మిషన్ కోసం అన్ని గురు కులాలకు కలిపి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిం చి ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 21 వరకు రూ.100 చెల్లించి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సె క్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 వరకు ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు. ఒక ఫోన్ నంబర్ తో ఒక అప్లికేషన్ ను మాత్రమే అంగీకరిస్తామని పేర్కొన్నారు. అప్లికేషన్ సమయంలో అభ్యర్థి ఫోటో బదులు మరొకరి పోటో పెట్టి అప్ లోడ్ చేస్తే క్రిమిన ల్ కేసు నమోదు చేస్తామని కన్వీనర్ హెచ్చరించారు. అడ్మిషన్ల ఎంపికలో ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటామని కృష్ణ ఆదిత్య వెల్లడించారు.
సీట్ల వివరాలు…
ఎస్టీ గురుకుల 83 స్కూళ్లు 6,640 సీట్లు,బీసీ గురుకుల 294 స్కూళ్లు 28,680సీట్లు,ఎస్సీ గురుకుల 235 స్కూళ్లు,18,700 సీట్లు,
బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో 5వ తర గతిలో అడ్మిషన్ కోసం మొత్తం సుమారు 55 వేల సీట్లు ఉన్నాయి. గత ఏడాది 1.60 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. గురుకులాల్లో సీట్లకు భారీ డిమాండ్ ఉందని, ప్రతి ఏటా అప్లై చేస్తు న్నస్టూడెంట్స్ సంఖ్య పెరుగుతున్నదనారు. ఉచిత విద్య, వసతి, బక్స్ తో పాటు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు చెల్లి స్తుండటం, రిజల్ట్ కూడా 90 శాతానికిపైగా నమోదు అవుతున్నది. వీటితోపాటు ఎంసెట్, క్యాట్, ఐసెట్, ఐఐటీ జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సైతం గురుకు లాల్లో ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ట్రైనింగ్ ఇస్తుండటంతో మరింత ఆదరణ పెరుగుతున్నది.



