నవతెలంగాణ – కామారెడ్డి
సోమవారం కలెక్టర్ కార్యాలయం లో భిక్నూర్ మండలంలోని పునరావాస కేంద్రం నందు గల దివ్యాంగుల ద్వారా తయారు చేయబడిన రాఖీల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. కలెక్టర్ అనుమతి తో సిబ్బంది కలెక్టర్ ప్రాంగణం లో సోమవారం రాఖి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల దివ్యంగులు తయారు చేసిన రాఖీలు ఆకర్షణ గా నిలిచాయి. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించి డబ్బులు చెల్లించి, మొదటి రాఖీ కొనుగోలు చెసి దివ్యాంగులలో ఉత్సాహాన్ని నింపారు. ఇలాంటి కార్యక్రమాలు విరివి గా నిర్వహిస్తూ దివ్యాంగులను ప్రోత్సాహించాలని కలెక్టర్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి సలహాను అందించారు.
ఈ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కి వచ్చిన పలువురి ని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డి ఆర్ డి ఏ, పి డి సురేందర్ , ఏపీ డి విజయలక్ష్మి, డీపీఎం హెచ్డి శ్రీనివాస్, ఏపీ ఏం సాయిలు, సీసీ హరిలాల్ , ఎన్ హెచ్ సి ప్రొఫెషనల్స్ డాక్టర్. నవీన్ శ్రీరాముల , స్పీచ్ తెరపిస్ట్ రాధిక, స్పెషల్ ఎడ్యుకేటర్ రేణుక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు ఇతరతర అధికారులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.