Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్

ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
స్థానిక సంస్థల ఎన్నికలకు నేటి నుండి  జిల్లా వ్యాప్తంగా నామినేషన్  ప్రక్రియ ప్రారంభమైందని జిల్లాలో మొదటి విడతగా మండలాల్లో, 10జెడ్పిటిసి, ఎంపీటీసీ 84 స్థానాలకు ఎలక్షన్లు జరగనున్నాయని  జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంత రావు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి , యాదగిరిగుట్ట, రాజాపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంత రావు  అధికారులను ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి సంబందించి ఈరోజు జరగనున్న  నోటిఫికేషన్ విడుదల,నామినేషన్ ప్రక్రియ కై  చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి సెంటర్ లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, నామినేషన్ వేసే అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ సెంటర్లో  లో అడిగి తెలుసుకోవచ్చు అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ సమయం లో  ఆర్వో, ఏ ఆర్వో ఏమేమి చెక్ చేయాలో క్షుణ్ణంగా కలెక్టర్ వివరించారు. మొదటి విడతలో  అడ్డ గూడూరు, మోత్కూర్,  ఆలేరు,ఆత్మ కూర్ యం, బొమ్మలరామారం, గుండాల, మోటకొండూర్, రాజాపేట తుర్కపల్లి యాదగిరిగుట్ట  మండలాలలో ఎన్నికల నిర్వహించేందుకు ఈరోజు నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

నామినేషన్ ప్రక్రియ జరిగే ఈ మూడు రోజులు ఉదయం 10.30 గంటల నుండి నుండి సాయంత్రం 5  వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -