Friday, November 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస్కూల్‌కు రాలేదని స్టూడెంట్ ఇంటికి వెళ్లిన కలెక్టర్

స్కూల్‌కు రాలేదని స్టూడెంట్ ఇంటికి వెళ్లిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భువనగిరి హైస్కూల్‌లో టెన్త్ విద్యార్థులకు గురువారం గణితం బోధించారు. బానోతు సుష్మిత అనే విద్యార్థిని స్కూల్‌కు రాలేదని తెలుసుకుని, ఆమె ఇంటికి వెళ్లి ఆరా తీశారు. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్కూల్‌కు రాలేదని సుష్మిత వివరించింది. కుటుంబ ఆర్థిక స్థితిని తెలుసుకున్న కలెక్టర్, చదువు కొనసాగించాలని, ఇబ్బందులుంటే చూసుకుంటానని హామీ ఇచ్చారు. సాయంత్రం తహసీల్దార్ ద్వారా సుష్మితకు పుస్తకాలు, స్టడీ చైర్, రైటింగ్ ప్యాడ్ అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -