Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్కలెక్టర్.. ఉపాధ్యాయుడైన వేళ...

కలెక్టర్.. ఉపాధ్యాయుడైన వేళ…

- Advertisement -
  • – ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
    – సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ
    – విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు
  • నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
  • అన్ని తానై నిత్యం బిజీగా ఉండే జిల్లా  అధికారి సమయం కల్పించుకుని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఆ విద్యార్థులకు ఆయన ఉపాధ్యాయుడుగా మారి విద్యా బోధన చేస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా… ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి గదుల్లోని విద్యార్థుల ను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
  • విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధిస్తుండగా, పరిశీలించారు. 10 వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు బోదించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని సాధన చేయించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆవరణ అంతా మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని సూచించారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad