Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలుగుడ్ల సరఫరా టెండర్ నిర్వహించిన కలెక్టర్

గుడ్ల సరఫరా టెండర్ నిర్వహించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పరిధిలోని ఆంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లకు 2025 – 26 సంవత్సరానికి అవసరమైన గుడ్ల సరఫరా కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియ కలెక్టర్ నిర్వహించారు. ఇందులో భాగంగా టెక్నికల్ బిడ్‌లను తేది 31-07-2025 న గురువారం ఉదయం 11:00 గంటలకు కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్, కామారెడ్డి లో జిల్లా కలెక్టర్, జిల్లా కొనుగోలు కమిటీ ( డిపిసి ) చైర్మన్ ఆసీస్ సాంగ్వన్  ఆధ్వర్యంలో, డిపిసి సభ్యుల సమక్షంలో, బిడ్డర్ల సమక్షంలో తెరవడం జరిగింది. ఇద్దరు బిడ్డర్ లు మాత్రమే పాల్గొన్నారు. బిడ్డర్ల నుండి అందిన టెక్నికల్ బిడ్‌లను నిబంధనల ప్రకారం పరిశీలించరూ. అన్నీ అర్హత కలిగిన బిడ్డర్లను ఆర్థిక బిడ్డుల దశకు ఎంపిక చేయడం జరిగినది అని పత్రిక ప్రకటన ద్వారా తెలపటం జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -