- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ పీఆర్ పనుల్లో నకిలీ బిల్లుల వ్యవహారం వెలుగులోకి రావడంతో పంచాయతీ రాజ్ ముధోల్ మండల ఏఈ సురేందర్‌ను సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక్క ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చాక తదుపరి విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నకిలీ బిల్లుల వ్యవహారం నిజమేనని తేలినందున ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు చట్టవిరుద్ధంగా వ్యవహరించకూడదని, భవిష్యత్‌లో ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఉద్యోగులందరూ క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఈ సందర్బంగా సూచించారు.
- Advertisement -