Tuesday, January 6, 2026
E-PAPER
Homeజిల్లాలుసోలార్ విలేజ్‌ ప్రాజెక్టుపై కలెక్టర్ స‌మీక్ష‌

సోలార్ విలేజ్‌ ప్రాజెక్టుపై కలెక్టర్ స‌మీక్ష‌

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి: పీఎం సూర్యఘర్ ముస్తీ బిజిలి యోజన-మోడల్ సోలార్ విలేజ్ పథకంలో భాగంగా, కామారెడ్డి జిల్లాలో భిక్నూర్ గ్రామం మోడల్ సోలార్ విలేజ్ గ్రామంగా గ‌త ఏడాది అక్టోబర్లో జిల్లా స్థాయి కమిటి పీఎం సూర్యఘర్ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేశారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి కమిటి, ఆదేశాలనుసారం, టిజి రెడ్కో, టీజీఎన్ పిడిసిఎల్ పంచాయతి అధికార్లు క్షేత్ర స్థాయిలో భిక్నూర్ గ్రామంలో పర్యటించి అవసరమైన ప్రభుత్వ భవనాలకు, వివిధ స్థలల్లో సోలార్ సిస్టంలను ఏర్పాటుకోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను ( డిపిఆర్ ) తయారు చేసి జిల్లా స్థాయి కమిటికి సమర్పించారు.

దీనిలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అద్యక్షతన జిల్లా స్థాయి కమిటి సమావేశం, కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మోడల్ సోలార్ విలేజ్ అయిన భిక్నూర్ గ్రామంలో గల వివిధ రకాల ప్రభుత్వ భవనాలపై 116 కె డబ్ల్యూ సామర్థ్యం గల 28 ప్రభుత్వ భవనాలపై సోలార్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ సిస్టంలు ఏర్పాటు కోసం, 28 గ్రామంలోని గుర్తించిన వివిధ స్థలల్లో 20 ఎన్ ఓ ఎస్ సోలార్ వీధి దీపాలు ఏర్పాటు కోసం, 1500 ఎల్.పి.డి గల సోలార్ వాటర్ హీటర్ గ్రామంలో గల రెసిడెన్సియల్ హాస్టల్లో ఏర్పాటుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను ( డిపిఆర్ ) ను కలెక్టర్, జిల్లా స్థాయి కమిటి పరిశీలించిన అనంతరం పలు సూచనలు చేశారు. ఈ సమావేశం లో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -