- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల బస్సు ప్రమాదానికి గురైంది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కేఎల్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మణుగూరు నుంచి పాల్వంచకు వెళ్తుండగా మొండికుంటలోని సాయిబాబా ఆలయం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కొందరికి తీవ్రగాయాలు కావడంతో వారిని భద్రాచలంలోని ఆస్పత్రికి తరలించారు. అశ్వాపురం సీఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు.
- Advertisement -



