Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెలవు రోజుల్లో కళాశాలలను పూర్తిగా మూసి ఉంచాలి 

సెలవు రోజుల్లో కళాశాలలను పూర్తిగా మూసి ఉంచాలి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నావాతే ప్రతాప్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాల ప్రిన్సిపాల్ ని కలిసి ఈనెల 28 తేదీ నుండి వచ్చేనెల 5 వ తారీకు వరకు దసరా సెలవులు ఉన్నందున కళాశాలలను పూర్తిగా మూసివేయాలని ఎలాంటి ఎగ్జామ్స్ కానీ ఎక్స్ట్రా క్లాసులు నిర్వహించద్దని కళాశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఇందులో భాగంగా ఎస్ ఆర్ విద్యాసంస్థలు జోనల్ ఇంచార్జ్ శ్రీకాంత్ ని కలిసి మరి తెలిపారు.

27 తేదీన కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలలో ప్రత్యేకించి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు కావున ఆ యొక్క ఎగ్జామ్స్ త్వరగా ముగించి దసరా బతుకమ్మ పండుగ ఆడవారికి ప్రత్యేకమైనది కావున మహిళ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 27 తేదీన ఎగ్జామ్ తొందరగా నిర్వహించి విద్యార్థులను వారి వారి నివాసాలకు పంపాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ కళాశాల యాజమాన్యాలకు కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు గోదావరి జిల్లా నాయకులు గణేష్ యాదవ్, శేఖర్, శ్రీను, పరమేష్, వెంకట్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -