నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మినీ జూబ్లీ కాలనీవాసులు ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గుండోజి రవీందర్ ను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గుండోజి రవీందర్ దంపతులను కాలనీవాసులు పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. తమ కాలనీకి చెందిన ఉపాధ్యాయున్ని సన్మానించడం తమకెంతో సంతోషంగా ఉందని మినీ జూబ్లీ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడుగా తనను గౌరవించి సత్కరించిన కాలనీవాసులకు గుండోజి రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మినీ జూబ్లీ కాలనీవాసులు బద్దం రాజశేఖర్, పెంట కిషన్, చింత ప్రదీప్, చంద్రశేఖర్, రాజన్న, బాల్ రెడ్డి, పాషా, ధారి, బాలకృష్ణ, సుంకేట శ్రీనివాస్, బాలరాజు, సుంకరి మురళి, కాలనీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడికి కాలనీవాసుల సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES