Sunday, November 2, 2025
E-PAPER
Homeసమీక్షకలర్‌ ఫుల్‌ బటర్‌ ఫ్లై 'కన్యాకుమారి'

కలర్‌ ఫుల్‌ బటర్‌ ఫ్లై ‘కన్యాకుమారి’

- Advertisement -

సీతాకోక చిలుకని ఇష్టపడని వాళ్లంటూ ఎవరూ ఉండరు. సీతాకోకని చూస్తే వయసు మర్చిపోతారెవరైనా. అలాంటి ఒక సీతాకోక చిలుకలాంటి సినిమానే మన ‘కన్యాకుమారి’. అసలు అది మూవీ కాదు. ఒక నోస్టాల్జియా. అందరి మెదడు పొరల్లో అట్టడుగున ఎక్కడో మరుగునపడిపోయిన జ్ఞాపకాలను తవ్వి తవ్వి వాటికి రంగులద్ది అందరి ముందుకు తెచ్చారు సృజన అట్టాడ… ఫీల్‌ గుడ్‌ మూవీ. విజయశాంతిలా యాంగ్రీ యంగ్‌ వుమన్‌ లా ఫైట్స్‌ అవి చేస్తేనే కాదు సింగల్‌ హ్యాండ్‌ తో ప్రేమను గెలిపించుకునే అమ్మాయిలు నటించే ఏ మూవీ ఐనా కానీ అది లేడీ ఓరియెంటెడ్‌ మూవీ అవుతుంది. ఈ సినిమా కూడా అంతే. ఒకప్పుడు బాపు బొమ్మ ఎవరంటే దివ్య వాణి అనేవాళ్ళు. ఈ మూవీలో హీరోయిన్‌ గీత సైని కూడా అలాంటి ఒక మోడరన్‌ బాపు బొమ్మే. అసలు ”ఏట్రా” అంటూ సినిమా మొత్తం పిలిచే పిలుపులో ఎంత ఆత్మీయత ఉంటుందో చెప్పలేను. ప్రేమ యూనివర్సల్‌ విషయం అని అందరికీ తెలుసు.

కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయాలంటే మాత్రం అందరికీ అర్ధమయ్యే ఇంకో యూనివర్సల్‌ పాయింట్‌ ఐతే త్వరగా కనెక్ట్‌ అవుతుంది.. అదే ఈ డైరెక్టర్‌ కూడా చేసింది. అదే పంట. పొలం భాషలో ఈ ప్రేమను చెప్పడం చాలా హాయిగా అనిపిస్తుంది. కవిత్వం చదువుతున్న ఫీల్‌ వస్తుంది. ”ఎండిపోయిన పొలం అమ్మాయనుకో… పచ్చని పంట పెళ్ళనుకో… పంట పండించాలంటే దుక్కి దున్నుతాం కదా అలా నేను ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతాను… తర్వాత పొలానికి నీరు పెడతాం. అంటే నేను అమ్మాయితో మాటామాటా కలుపుతాను. తర్వాత విత్తనం వేస్తాం కదా అంటే నేను ఐ లవ్‌ యు చెప్తాను. తర్వాత విత్తనం మొలకెత్తుద్ది. అలా ప్రేమ పుడుతుంది.” అని హీరో వాళ్ళ నాన్నకు చెప్పడం నిజంగా ఆ క్యారెక్టర్స్‌లో మనకు మనమే కనిపిస్తాం.

ఎందుకంటే ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మన తల్లితండ్రులంతా కూడా వ్యవసాయదారులు.. వ్యవసాయం చేసిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టే ఈ మూవీ అందరికీ బాగా కనెక్ట్‌ అయ్యింది. అసలు ఈ మూవీ గురించి ఎందుకు ఇంతమంది ఇంతలా మౌత్‌ పబ్లిసిటీ చేస్తున్నారు అని అడిగితే సింపుల్‌ థింగ్‌.. రక్తపాతం లేదు, కుళ్ళు, కుతంత్రాలు లేవు.. టాక్సిక్‌ హార్మోన్స్‌కి దూరంగా తీసుకెళ్లే ఒక పల్లెటూరు, పొలం, రైతులు, పెళ్లి, ప్రేమ.. అదొక అందమైన లోకం… ఈ అందమైన ఫీల్‌తో ఒక్కసారిగా ఆడియన్స్‌లో హ్యాపీ హార్మోన్స్‌ని ఇంజెక్ట్‌ చేశారు ఈ డైరెక్టర్‌. అందరూ సినిమాలు తీస్తారు.. కానీ కొందరే జీవితాలకు రంగులద్ది సినిమాగా చూపిస్తారు. నిజంగా ఈరోజు ప్రేమ కండిషన్స్‌ మీద పెళ్లి పైసల మీద నడుస్తున్న టైములో ప్రేమ ఎలా ఉండాలో చూపించారు. ఒకరి కోసం ఒకరుగా ఉన్నారు. త్యాగం చేసుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, జాబ్స్‌ చేశారు, పంట పండించారు, కలలు నెరవేర్చుకున్నారు అండ్‌ ఫైనల్‌ వరకు కలిసే ఉన్నారు.

నాకు బాలచందర్‌ సినిమాలు అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. ఎందుకంటే ఆ సినిమాల్లో ఎండింగ్‌ అనేది ఉండదు…శుభం కార్డు పడుతుంది అంతే కానీ అక్కడే అసలు కథ, అందులో పాత్రలు మనల్ని వెంటాడుతూ ఇంటి వరకే కాదు వయసు పెరుగుతున్న కొద్ద ప్రతీ ఆలోచనలో ఆ పాత్రలు ఎక్కడో చోట కనిపిస్తూ ఆ సినిమాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేలా చేస్తాయి. ఈ సినిమాలో కూడా హడావిడిగా పెళ్లి చేసేసుకోవడాలు లాంటివి ఏమీ లేవు. పెళ్లంటే నూరేళ్ళ పంట అంటూ కన్యాకుమారి చేత చెప్పించి ఇద్దరూ కలిసి వాళ్ళ ప్రేమ పొలంలో హాయిగా ఎగురుతూ కనిపించడంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు నా బ్లడ్‌ ఉవ్వెత్తున ఎగసి పడలేదు హాయిగా నా మనసు సేదదీరింది. అలా నవ్వుకుంటూనే ఉన్నాను. సినిమా అంటే ఒక పుస్తకం చదువుతున్నట్టే ఉండాలి. చదివిన పుస్తకాలను మళ్ళొకసారి గుర్తుచేస్తున్నట్టు ఉండాలి.. ఇంకో మాట ఐతే ఈ మూవీ చిన్న తిరపతితో సీక్వెల్‌ వస్తుందో లేదో చూడాలి.

  • అమూల్యచందు, 9059824800
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -