Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్‌ నిలిపేయాలి

కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్‌ నిలిపేయాలి

- Advertisement -

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కర్రెగుట్టల్లో కూంబింగ్‌ చర్యలను తక్షణమే నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలోకి వచ్చి, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా ఎత్తుగడలను మార్చుకోవాలని సూచించారు. అడవుల్లోని లక్షల కోట్ల రూపాయల ఖనిజ సంపద కోసం మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లో లక్షలాది చెట్లు నరికివేయడాన్ని ఆపేయాలని డిమాండ్‌ చేశారు.

ఒకదగ్గర చెట్టును తొలగించాలంటే మరో ప్రాంతంలో కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్న గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీర్పును అడ్డం పెట్టుకుని ఈ చర్యలకు పాల్పడటాన్ని తప్పుబట్టారు. అడవిలో ప్రకృతి సహజంగా పెరిగిన చెట్లను కొట్టేసి, ఇతర ప్రాంతంలో అన్ని చెట్లు పెంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. కార్పొరేట్‌ ఖనిజ సంపదను అప్పగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. మావోయిస్టుల పేరు చెప్పి మానవ హననానికి పాల్పడటం మానవత్వానికే మచ్చ అని పేర్కొన్నారు. విశాల దృక్పథంతో ఆలోచించి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి ప్రభుత్వం తరపున కూడా కృషి చేయాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -