- Advertisement -
అక్కడ ఒక మంట ఏపెత్తున
సహృదయాన్ని రగిలిస్తూ
పగలబడి మరీ నవ్వుతోంది
ఓ ధర్మ రక్షణా వీరఖడ్గమా
ఒకే ఒక్కసారి వచ్చిపో
ఒక స్వార్థం జడలు విడుచుకుని
కదం తొక్కుతూ నర్తిస్తోంది
తారతమ్యం తాండవం చేస్తోంది
ఓ న్యాయ సంరక్షణమా
ఒకసారి పరిరక్షించి చూసిపో
ఒక అవహేళన విజృంభించి
శక్తిలేని జీవనాన్ని తొక్కేస్తూనే
ధిక్కారాన్ని సన్మానిస్తోంది
ఓ మానవత్వమా
ఒక్కసారి వచ్చి చూసెళ్లిపో
ఇక్కడ ఒక ఢాంభీకం
గాంభీర్యం ప్రదర్శిస్తూనే
పడగలు విప్పి కాటేస్తోంది
పైశాచికత్వం రెచ్చిపోతోంది
ఓ సమాజ హితమా
ఒక్కసారి వచ్చి పరిష్కరించిపో
– నరెద్దుల రాజారెడ్డి, 9666016636
- Advertisement -



