Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల కోసం 27న చలో కలెక్టరేట్ కు తరలి రండి 

పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల కోసం 27న చలో కలెక్టరేట్ కు తరలి రండి 

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల 
పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల అమలుకై చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పెన్షనర్ల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్  ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పెన్షనర్ల బకాయిల గురించి  వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రెగ్యులర్ పెన్షనర్స్లందరూ 10:30 గంటలకు కలెక్టర్  కార్యాలయానికి చేరుకోవాలన్నారు. 2024 ఏప్రిల్ నుండి ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు ఇంత వరకు అందలేదన్నారు. జిపిఎఫ్, జిఐఎస్, gratuvity, ఈయల్స్ బిల్లు. మెడికల్ బిల్లులు, పిఆర్సి  బకాయిలు, అరియర్స్ బిల్లులు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. 2024లో రిటైర్ అయిన 8972 మందికి రూ.13 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.

వాటిని ఇంతవరకు చెల్లించకుండా కాలం గడుపుతున్నారు. ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన చర్చలో ప్రతి నెల రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ప్రతి నెల బకాయిలకు నిధులువిడుదల చేయడం లేదన్నారు. రిటైర్ అయిన వారు డబ్బులు రాక అనారోగ్య కారణాల వల్ల చికిత్స చేయించుకోలేక, చనిపోతున్నట్లు తెలిపారు. రిటైర్ అయిన వారి పిల్లల పెళ్లిళ్లు డబ్బులు రానందువల్ల చేయలేక పోతున్నారన్నారు. ఇండ్లు కట్టుకోవాలని కన్న కలలు కల్లాలుగా మారి, కుటుంబ సభ్యుల చివాట్లతో మానసిక చోభతో మరణిస్తున్నారు. వీటికి కారణం ఈ ప్రభుత్వమే.

ఈ మరణాలన్నీ ప్రభుత్వం హత్యలుగా భావించి మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న గద్వాల కలెక్టర్  ద్వారా వినతి పత్రాన్ని సమర్పించేందుకు జోగులాంబ గద్వాల జిల్లా బాధిత పెన్షనర్లందరూ ఉదయం 10 గంటలకు రావాలని టీజీపీఏ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ బాబు, ప్రధాన కార్యదర్శి శంకర ప్రభాకర్ సభ్యులు ఎండి సుభాన్ రమేష్ బాబులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తున్నారు.  అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -