Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్30న కలెక్టరేట్ల ముందు ధర్నాకు తరలి రావాలి…

30న కలెక్టరేట్ల ముందు ధర్నాకు తరలి రావాలి…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : వలసలను ఆపండి.. పనులనైనా చూపండి.. తిండన్న పెట్టండని లక్షలాదిమంది వ్యవసాయ కార్మికులు గ్రామీణ ఉపాధి హామీ పథక రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు కార్మికులు తరలి రావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తున్న కార్మికుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొన్న అనంతరం నర్సింహ మాట్లాడుతూ.. పేదలు కష్టజీవులు తమ జీవనోపాధి కోసం, చట్టాల కోసం, పని కోసం, భూమికోసం, భువ్వ కోసం పోరాడి హక్కులు, చట్టాలు సాధించుకుంటే కేంద్రంలోని ఈ మోడీ ప్రభుత్వం ఆహక్కులను, చట్టాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారని విమర్శించారు. దేశానికి గ్రామ సీమలే పట్టుకొమ్మలు గ్రామాలలో ఉన్న ప్రజలు ఆర్థికంగా బలపడితేనే ఈ దేశం ముందుకు పోతుందనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వము వందరోజుల పనిని తెస్తే ఈనాడు ఈ మోడీ ప్రభుత్వం దానిని ఎత్తివేయడానికి అనేక కుట్రలు చేస్తూ కొత్త జీవోలు తెస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా కార్మికులందరూ ఐక్యంగా సంవత్సరానికి 200 రోజుల పని దినాలకోసం, రోజు కూలీ 600 రూపాయల కోసం, పెండింగ్ లో ఉన్న వేతనాల కోసం, నూతన జాబ్ కార్డుల కోసం, భార్య భర్తలకు గడ్డపార, తట్ట, పారా, కొడవలి, గొడ్డలి లాంటి పనిముట్లు కోసం, పనిచేసే దగ్గర త్రాగడానికి నీరు, నీడ కోసం టెంటు, ప్రమాదం జరిగినప్పుడు మెడికల్ కిట్టు కోసం, సమ్మర్ అలవెన్స్ ల కోసం, నాలుగు కిలోమీటర్ల దూరం దాటితే లోకల్ ఆటో చార్జీల కోసం, ఫీల్డ్ అసిస్టెంట్లకు పెండింగ్ వేతనాల కోసం, ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేసి వారి యొక్క వేతనాలు పెంచుట కోసం, వాచర్లను, సీనియర్ మేట్లను ప్రత్యేకంగా గుర్తించి సంవత్సరం మొత్తం పనులు కల్పించడం కోసం, అర్హత కలిగిన వారికి ఫీల్డ్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కోసం, ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యంతో పాటు, పని చేయని రోజులలో నష్టపరిహారం చెల్లింపు కోసం,  ప్రమాదంలో మరణిస్తే కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కోసం, దరఖాస్తు పెట్టుకొని పని చూపని వారికి చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సిలివేరు మహేందర్ ఉపాధి హామీ కార్మికులు గోపె రాజయ్య, కొంతం లత, చిన్నం శ్రీలత, సాలమ్మ, సరోజన, సుజాత, ఇందిర, సుబ్బురు కలమ్మ, సప్న, బీరమ్మ, రజిత, చింతల పద్మ, బాల లక్ష్మి, సిలువేరు జంగమ్మ, పొన్నాల శ్రీశైలం రెడ్డి, బాల్ రెడ్డి , బోనగిరి ఆంజనేయులు, గోపె నవనీత, మహేశ్వరి, లలిత, చిన్నం సుజాత, కడగంచి కల్పన, బాల్ద ఎల్లమ్మ, బసాని కలమ్మ, ఐలమ్మ, చింతల ఆదిలక్ష్మి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -