కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, క్రీడా మంత్రి శ్రీహరి, కేటీఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్ అక్టోబర్ 2 నుంచి గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా జరుగనుంది. ప్రైమ్‌వాలీబాల్ లీగ్‌లో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ (హెచ్‌బిహెచ్) మ్యాచ్‌లకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా మాజీ మంత్రి కేటీఆర్‌లను హెచ్‌బిహెచ్ యజమాని అభిషేక్ కంకణాల మర్యాదపూర్వకంగా ఆహ్వానం అందించారు. కిషన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కేటీఆర్‌లను సోమవారం వారి కార్యాలయాల్లో కలిసి బ్లాక్‌హాక్స్ గఫ్ట్ బాక్స్‌తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీలు, క్యాప్‌లను అభిషేక్ రెడ్డి బహూకరించారు. దసరా పండుగ రోజు జరిగే లీగ్ ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్, కాలికట్ హీరోస్ తలపడనున్నాయి.