సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి అజహరుద్దీన్ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డిని మైనార్టీ శాఖ మంత్రి అజహరుద్దీన్, క్రిస్టియన్ మైనార్టీ నేతలు శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలంటూ ఆయనకు ఆహ్వానపత్రికను అందజేశారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. క్రిస్టియన్ మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతోపాటు వారి కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం ప్రకటిస్తారు. వారి సమస్యల గురించి తెలుసుకుంటారు. భవిష్యత్తులో చేపట్టబోయే చర్యల గురించి వివరిస్తారు.
నేడు హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలకు రండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



