‘ది వైర్’ సంపాదకుడికి గువహతి పోలీసుల సమన్లు
గువహతి : ఆపరేషన్ సిందూర్‌పై ప్రచురితమైన వార్తకు సంబంధించి దాఖలైన కేసులో ఈ నెల 22న తన ఎదుట హాజరు కావాలంటూ ‘ది వైర్’ పోర్టల్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్దార్ధ వరదరాజన్‌కు గువహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. అస్సాం పోలీసులు దాఖలు చేసిన మరో ఎఫ్‌ఐఆర్ కింద వరదరాజన్‌కు, పోర్టల్‌ను నిర్వహిస్తున్న ఫౌండేషన్ సభ్యులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ గువహతి పోలీసులు ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం. వేరే జిల్లాలో దాఖలైన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, కాబట్టి ఆ ఆదేశాలు గువహతి జిల్లాకు వర్తించవని పోలీస్ జాయింట్ కమిషనర్ అంకుర్ జైన్ వితండవాదం చేశారు.
తాజా ఆదేశాల ప్రకారం వరదరాజన్ ఈ నెల 22న ఉదయం 11.30 గంట లకు పాన్ బజార్‌లోనిక్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. అరెస్ట్ నుంచి వరదరాజన్‌కు రక్షణ కల్పించిన కేసు జులై 11న మోరిగాన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు ఏ ఆరోపణ లతో కేసు నమోదు చేశారో తాజా కేసులోనూ అవే ఆరోపణలు మోపారు.
22న విచారణకు రండి
- Advertisement -
- Advertisement -