Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారం మహాజాతరకు రండి

మేడారం మహాజాతరకు రండి

- Advertisement -

గవర్నర్‌కు మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క- సారక్క మహా జాతరకు హాజరు కావాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మంత్రులు కొండా సురేఖ, సీతక్క సోమవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో కలిసి ఆహ్వానపత్రికను అందించారు. మేడారం మహాజాతరను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.

డిప్యూటీ సీఎం, స్పీకర్‌కు ఆహ్వానం
మేడారం మహాజాతరకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -