సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆగస్టు 1వ తేదీ జరిగే నవతెలంగాణ పదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా రావల్సిందిగా ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డికి ఆహ్వానం అందింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మెన్ బివి రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్, సంపాదకులు రాంపల్లి రమేష్ బుధవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో సీఎంను కలిసి ఆ మేరకు ఆహ్వానపత్రాన్ని అందచేశారు. నవతెలంగాణ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ వార్షికోత్సవానికి రండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES