Thursday, October 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిసెంబర్‌ 19, 20 తేదీల్లో పీఎస్సీల చైర్‌పర్సన్ల సమావేశానికి రండి

డిసెంబర్‌ 19, 20 తేదీల్లో పీఎస్సీల చైర్‌పర్సన్ల సమావేశానికి రండి

- Advertisement -

ఉప రాష్ట్రపతికి టీజీపీఎస్సీ చైర్మెన్‌ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మెన్‌ బి వెంకటేశం బుధవారం న్యూఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. రాధాకృష్ణన్‌ తెలంగాణ గవర్నర్‌గా ఉన్నపుడు రాజ్‌భవన్‌ కార్యదర్శిగా పనిచేసిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 19,20 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పీఎస్సీల చైర్‌పర్సన్ల సమావేశానికి రావాలంటూ ఆహ్వానించారు. టీజీపీఎస్సీలో తీసుకుంటున్న సంస్కరణలు, ఉద్యోగ నియామకాల ప్రక్రియ గురించి వివరించారు. నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, వేగంగా చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. టీజీపీఎస్సీ తీసుకుంటున్న చర్యల పట్ల ఉప రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్‌ సిబ్బందిని అభినందించారు. మెరిట్‌ ఆధారంగా పారదర్శకంగా నియామకాలను చేపట్టేందుకు చర్యలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -