- Advertisement -
మంత్రి సీతక్కకు మంచు లక్ష్మి ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్ మార్చి 27న చేపట్టిన సేవా కార్యక్రమంలో రావాలంటూ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ట్రస్ట్ ఫౌండర్, సినీ నటి మంచులక్ష్మి ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో లక్ష్మి మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం తమ సంస్థ చేయూతగా నిలుస్తోందని తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న సేవలకుగానూ మంచు లక్ష్మిని మంత్రి సీతక్క అభినందించారు.
- Advertisement -



