– కేటీఆర్‌కు అమీర్‌పేట గురుద్వారా కమిటీ ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఈనెల 14న ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – వైశాఖి’ వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను గురుద్వారా ప్రతినిధులు ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ అధ్యక్షులు ఎస్ దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. వైశాఖి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను వారికి అందజేసింది. ఈనెల 14న మధ్యాహ్నం 1.30 గంటలకు అమీర్‌పేట్‌లోని శ్రీ గురు గోవింద్ సింగ్‌జీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో జరిగే ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని వారు కోరారు. పంజాబ్ నుంచి విచ్చేసిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని వివరించారు. ఈ వేడుకలకు సుమారు ఎనిమిది వేల నుంచి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని కేటీఆర్‌ను వారు కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
రేపు మంచిర్యాల పర్యటనకు కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కలిసి ఆహ్వానించారు. ఎన్నో ఒడిదుడుకులు, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి కట్టుబడి ఉన్న క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మెన్, సభ్యులను కేటీఆర్ సన్మానిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు క్యాతన్‌పల్లిలోని బాల్క సుమన్ నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు. అదే సమయంలో పలు సంఘాల నాయకులను ఆయన కలుస్తారు.
14న వైశాఖి వేడుకలకు రండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



