Sunday, September 21, 2025
E-PAPER
Homeక్రైమ్దైవ దర్శనానికి వస్తూ మృత్యు ఒడిలోకి..

దైవ దర్శనానికి వస్తూ మృత్యు ఒడిలోకి..

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
దైవదర్శనానికి వస్తూ ఒక వ్యక్తి మృతి ఒడిలోకి జారుకున్న సంఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో గాయపడిన నిర్మల తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ కు చెందిన శ్రీనివాస్ ,నిర్మల దంపతులు ఈరోజు అమావాస్య కావడంతో మహబూబ్నగర్ నుండి దైవ దర్శనానికి శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి వస్తున్న సందర్భంలో దేవస్థాన సమీపంలో ఒక ట్రాక్టర్ రివర్స్ లో వచ్చి ఢీకొన్నట్లు ఆమె తెలిపింది. వెంటనే స్థానికులు గుర్తించి 108 వాహనం నందు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు పరిశీలించి, శ్రీనివాస్ మృతి చెందినట్లు తెలిపారు. నిర్మలకు కుడికాలు విరిగిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు వివరాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -