నవతెలంగాణ – ఆర్మూర్
విప్లవోధ్యమ కార్యదీక్షకుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరి అని అయన మార్గం అందరికి ఆచరణీయం అని సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, జిల్లా నాయకుడు బి దేవారంల పిలుపును ఇచ్చారు. రేపు జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రథమ వర్ధంతి సభ సందర్భంగా బాబానగర్ లో శనివారం మాట్లాడుతూ.. కామ్రేడ్ కె యాదగిరి విప్లవవోధ్యమాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు అన్నారు. ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన గొప్ప త్యాగదనుడు అన్నారు. జీవితాంతం విప్లవోది మల్ల వ్యాప్తి కోసం అంకిత భావంతో, నిజాయితీగా నికార్సుగా పనిచేసిన ఆ విప్లవ ధన్యజీవి కామ్రేడ్ కర్నాటి యాదగిరి అని అన్నారు.
ముఖ్యంగా జిల్లా విప్లవోద్యమానికి అమరుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. తన విప్లవోద్యమ కాలంలో సగ జీవితం ఆర్మూర్, భీంగల్, సిరికొండ ఉద్యమంకు ధారబోసిన మార్గదర్శి అన్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి నిడారంబరంగా, త్యాగపూరితమైన జీవితం గడిపారన్నారు. పోలీసులచే చిత్రహింసలు అరెస్టులు చేయబడ్డ చలించని గుండె నిబ్బరం కలిగిన వాడున్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి ని స్కరించుకోవడం అంటే విప్లవోద్యమంలో మనము కార్యదర్శిలుగా మమేకమై ఆయన ఆశయాలను ముందుకు తీసుకపోవడమేనని ఆయన గుర్తు చేశారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి ప్రథమ వర్ధంతి సభకు విద్యార్థులు, యువకులు, కార్మికులు, రైతులు, మేధావులు,ప్రజలు, పెద్దఎత్తున హాజరు అయి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.



