Tuesday, October 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి..

ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్:
మండలంలో కొమురం భీమ్ 85వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు చింతల్ సాంగ్వి, జాతర్ల గ్రామాలలో కొమురం భీం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పలువురు వ్యక్తులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ మండల కన్వీనర్ జెల్కె పాండురంగ్, కాంగ్రెస్ జడ్పిటిసి అభ్యర్థి మెస్రం జంగు బాపు, గ్రామ పటేళ్లు, దేవరీలు, మహాజాన్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -