ఆది, మేఘ, హనిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బుల్లెట్ రెడ్డి’. శ్రీ లక్ష్మి ఫిలింస్ బ్యానర్ పై ఆది దర్శక, నిర్మాతగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత హీరో ఆది మాట్లాడుతూ,’యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమిది. ఈ చిత్రంలో హీరో బుల్లెట్ రెడ్డి వెయ్యి ఎకరాల జమీందారు. ఆయనకు చెందాల్సిన లక్షల కోట్ల రూపాయల విలువైన నిధి దక్కించుకునేందుకు కొందరు దురాశ పరులు ఎలా ప్రయత్నించారు?, ఆ ప్రయత్నాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఖయ్యూం మాస్టర్ నాకు బాగా సపోర్ట్ చేశారు.
ఈ నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. ఆ తర్వాత గోవాలో జరిపే షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణ జరిపి, చివరి షెడ్యూల్ మళ్లీ ఆదిలాబాద్, నిజామాబాద్‌లో చేస్తాం. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న మా మూవీని రిలీజ్ చేస్తాం. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అమలాపురం అంబేద్కర్ జిల్లా..ఈ మూడు జిల్లాల్లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం’ అని అన్నారు. ‘ఆది నాకు శిష్యుడు. మంచి ఫైట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఆకట్టుకునే పాటలతో ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని ఫైట్ మాస్టర్ ఖయ్యూం చెప్పారు.
కమర్షియల్ ‘బుల్లెట్ రెడ్డి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



